రెండురోజుల అమేఠీ పర్యటనకు ప్రియాంక - Amethi
కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో తన సోదరుడు రాహుల్‌గాంధీ తరఫున ప్రచారం చేయనున్నారు.
దేశవ్యాప్తంగా ఎటుచూసిన లోక్‌సభ ఎన్నికల ప్రచారాలే కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీల నేతలు, కార్యకర్తలు వ్యూహాలు రచిస్తున్నారు. జోరుగా ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న అమేఠీలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ పర్యటించనున్నారు. నేటి నుంచి రెండు రోజుల పాటు సాగే ఈ పర్యటనలో తన సోదరుడు రాహుల్‌గాంధీని గెలిపించాలని స్థానికులను అభ్యర్థించనున్నారు ప్రియాంక. అనంతరం స్థానిక నేతలు, కార్యకర్తలతో ప్రియాంక సమావేశమవుతారని పార్టీ అధికార ప్రతినిధి అనిల్ సింగ్ తెలిపారు.