రెండో పర్యాయం అధికారంలోకి వచ్చి 100 రోజులు గడిచిన సందర్భంగా... భాజపా వేడుకలకు తలపెట్టడంపై కాంగ్రెస్ నేత ప్రియాంకగాంధీ మండిపడ్డారు. భాజపా వేడుకలను.. వాహన, రవాణా, మైనింగ్ రంగాలు తమ 'నాశన వేడుకలు'గా చూస్తాయని విమర్శించారు.
ప్రియాంకగాంధీ ట్విట్టర్ వేదికగా మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వాహన రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ఎత్తిచూపిన మీడియా నివేదికలను అందులో పోస్ట్ చేశారు.
"అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా భాజపా వేడుకలు జరుపుకోనుంది. అయితే ఈ వేడుకలను వాహన, రవాణా, మైనింగ్ రంగాలు తమ నాశన వేడుకలుగా చూస్తున్నాయి."- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ నేత
దేశ ఆర్థిక వృద్ధి మందగమనానికి, వివిధ రంగాలు నష్టాల్లో మునిగిపోవడానికి భాజపా ప్రభుత్వ అసమర్థ చర్యలే కారణమని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో అసమర్థతలే ఇందుకు కారణమని పేర్కొంది.
ఇదీ చూడండి: 'ఆర్టికల్ 370' ప్రత్యేక ప్రతిపత్తి కాదు : డోభాల్