తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పౌర ఆందోళనల నడుమ యూపీలో ప్రియాంక - NRC LATEST NEWS

నేడు కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొననున్నారు కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా. ఇప్పటికే ఆమె లఖ్​నవూ చేరుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు హాజరు కానున్నట్లు సమాచారం.

Priyanka arrives in Lucknow on two-day visit
పౌర ఆందోళనల నడుమ యూపీకి ప్రియాంక

By

Published : Dec 28, 2019, 5:26 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో శనివారం జరగనున్న కాంగ్రెస్​ పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొననున్నారు. ఇందుకోసం ఆమె ఇప్పటికే... లఖ్​నవూ చేరుకున్నారు. ఇటీవల కొంత మంది నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన నేపథ్యంలో... రాష్ట్ర పార్టీ కేడర్​ను బలోపేతం దిశగా.. ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇంకా.. పార్టీ సలహాదారుల మండలి​, వ్యూహాత్మక బృంద సమావేశాలకు హాజరుకానున్నట్లు సమాచారం.

ఈ సందర్భంగా.. కాంగ్రెస్​ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి జీపీఏ పార్కు ఎదురుగా ఉన్న అంబేద్కర్​ విగ్రహం వరకు శాంతియుత ప్రదర్శన​ చేయాలని యోచిస్తోంది. కానీ సెక్షన్​ 144 విధింపు కారణంగా.. ఈ కార్యక్రమం జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.

అల్లర్ల అనంతరం తొలిసారి...

ఇటీవల మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రియాంక గాంధీ... షాహీద్​ స్మారకం నుంచి జీపీఏ పార్కు వరకు శాంతియుత ర్యాలీ చేపట్టారు. పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో హింసాత్మక నిరసనల అనంతరం.. తొలిసారి యూపీలో పర్యటించనున్నారు ప్రియాంక. ఈ అల్లర్లలో ఇప్పటి వరకు 19మంది మరణించారు.

పౌర ఆందోళనల్లో మరణించిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లాలని ప్రయత్నించిన ప్రియాంక, రాహుల్​ గాంధీలను గత ఆదివారం మేరఠ్​లో పోలీసులు అడ్డుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details