బంగాల్లోని ఓ ప్రైవేటు బస్సుల యాజమాన్యాల సంఘం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా రెండు సీట్లు కేటాయించాలని నిర్ణయించింది. ప్రతి బస్సులో హిజ్రాల కోసం 'త్రిధర' పేరుతో రెండు సీట్లు ఉంటాయన్నారు జాయింట్ కౌన్సిల్ ఆఫ్ బస్ సిండికేట్స్ ప్రధాన కార్యదర్శి తపన్ బెనర్జీ.
"ట్రాన్స్జెండర్లకు సీట్లు కేటాయించడం మాత్రమే దీని ఉద్దేశం కాదు. వారిని గుర్తించి, వారి పట్ల తోటి ప్రయాణికుల్లో అవగాహన కల్పించడమే ప్రధాన ధ్యేయం."