తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2020, 7:28 AM IST

Updated : Feb 17, 2020, 10:58 PM IST

ETV Bharat / bharat

ప్రాజెక్టుల అమలు, పురోగతిపై.. ప్రధాని 'ప్రగతి సమీక్ష'

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టులు, వాటి పురోగతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నేడు 32వ ప్రగతి సమీక్ష సమావేశం జరగనుంది. గత సమీక్ష భేటీల్లో.. రూ. 12 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులపై ప్రధాని సమీక్ష నిర్వహించారు.

Prime Minister Narendra Modi
ప్రాజెక్టుల అమలు, పురోగతిపై.. ప్రధాని 'ప్రగతి సమీక్ష'

దేశవ్యాప్తంగా.. వివిధ ప్రాజెక్టుల అమలు, వాటి పురోగతిపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు సమీక్షించనున్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో.. ఇవాళ 32వ ప్రగతి సమీక్ష సమావేశం జరగనుంది.

రూ.12 లక్షల కోట్ల ప్రాజెక్టులపై..

గత సమీక్ష సమావేశాల్లో.. రూ 12 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులపై.. ప్రధాని సమీక్ష నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 2019లో నిర్వహించిన సమావేశంలో.. 16 రాష్ట్రాలకు సంబంధించిన రూ. 61 వేల కోట్ల విలువైన 9 ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

నేటి సమావేశంలో.. విదేశాల్లో పనిచేస్తోన్న భారతీయుల నుంచి వచ్చే ఫిర్యాదులు సహా.. జాతీయ వ్యవసాయ మార్కెట్, మౌళిక వసతుల అభివృద్ధి, ఇతర పథకాలపై.. చర్చించనున్నట్లు సమాచారం.

ప్రగతి పేరిట నిర్వహించే ఈ సమావేశంలో.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష జరుపుతారు.

ఇదీ చూడండి: సెంట్రల్​ విస్టా: అన్నీ ఒక్క చోట.. దేశ రాజధాని ఘనత

Last Updated : Feb 17, 2020, 10:58 PM IST

ABOUT THE AUTHOR

...view details