తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాజమాత జ్ఞాపకార్థం నాణెం విడుదల చేసిన మోదీ - రాజమాత సింధియా నాణెం

గ్వాలియర్ రాజమాతగా ప్రసిద్ధిగాంచిన భాజపా నేత విజయరాజే సింధియా జయంతి సందర్భంగా.. ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. సింధియా.. తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ కీర్తించారు.

Prime Minister Narendra Modi releases a commemorative coin of Rs 100 in honour of Rajmata Vijaya Raje Scindia
రాజమాత జ్ఞాపకార్థం నాణెం విడుదల చేసిన మోదీ

By

Published : Oct 12, 2020, 12:09 PM IST

గ్వాలియర్​ రాజమాతగా పేరొందిన భాజపా నేత విజయరాజే సింధియా జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం విడుదల చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజమాత జయంతి సందర్భంగా ఆమె పేరు, ముఖచిత్రంతో ముద్రించిన రూ.100 నాణాన్ని వర్చువల్ కార్యక్రమం ద్వారా ఆవిష్కరించారు.

విజయరాజే సింధియా జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెం

రాజమాత సింధియా తన జీవితాన్ని పేదలకే అంకితమిచ్చారని మోదీ ఈ సందర్భంగా కీర్తించారు. ప్రజలకు ప్రాతినిథ్యం వహించడాన్ని అధికారంలా కాకుండా.. సేవగా భావించారని పేర్కొన్నారు. ముమ్మారు తలాక్ చట్టం తీసుకురావడం ద్వారా మహిళా సాధికారత విషయంలో రాజమాత ఆశయాలను దేశం మరింత ముందుకు తీసుకెళ్లిందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details