తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు మోదీ నివాళి - ప్రధాని మోదీ గుజరాత్​ పర్యటన

సర్దార్​ వల్లభ్​భాయ్​ పటేల్​ జయంతి సందర్భంగా.. గుజరాత్​లోని ఐక్యతా విగ్రహం వద్ద ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు.

Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel on his birth anniversary, at the Statue of Unity
సర్దార్​ పటేల్​కు ప్రధాని మోదీ నివాళి

By

Published : Oct 31, 2020, 9:00 AM IST

Updated : Oct 31, 2020, 9:11 AM IST

ఐక్యతా విగ్రహం వద్ద పటేల్​కు మోదీ నివాళి

రెండు రోజుల గుజరాత్​ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శనివారం సర్దార్ వల్లభ్​భాయ్​​ పటేల్​ జయంతి సందర్భంగా ఐక్యతా విగ్రహాన్ని సందర్శించారు. పటేల్​ విగ్రహానికి నివాళులర్పించిన మోదీ.. దేశ సేవకు మహా నేత చేసిన కృషిని స్మరించుకున్నారు.

సర్దార్​ పటేల్​ జయంతి సందర్భంగా
సర్దార్​కు మోదీ నివాళి

అనంతరం పటేల్​ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 'రాష్ట్రీయ ఏక్తా దివస్​' పరేడ్​ను వీక్షించారు ప్రధాని. ఈ వేడుకలో మోదీ ధరించిన టోపీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఐక్యతా విగ్రహం వద్ద మోదీ
పరేడ్​ను వీక్షిస్తున్న ప్రధాని
సైన్యం సెల్యూట్​
పోలీసుల పరేడ్​
పరేడ్​లో ప్రదర్శన
పరేడ్​ సాగింది ఇలా
పరేడ్​
రాష్ట్రీయ ఏక్తా దివాస్​ పరేడ్​

ఇందిరా గాంధీకి నివాళి..

భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు మోదీ. ఈ మేరకు ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:-'జంగిల్ సఫారీ'లో ప్రధాని మోదీ విహారం

Last Updated : Oct 31, 2020, 9:11 AM IST

ABOUT THE AUTHOR

...view details