ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై ఇరువురు రాష్ట్రపతి భవన్లో చర్చించారు. తూర్పు లద్దాఖ్‌లోని లేహ్‌లో ప్రధాని మోదీ.. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో మోదీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే తన పర్యటన గురించి రాష్ట్రపతికి మోదీ వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది.
రాష్ట్రపతితో మోదీ భేటీ.. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ - ఇండో చైనా సరిహద్దు వివాదం
13:18 July 05
రాష్ట్రపతితో మోదీ భేటీ.. సరిహద్దు ఉద్రిక్తతలపై చర్చ
సరిహద్దు ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీ.. శుక్రవారం లద్దాఖ్ లేహ్‌లో పర్యటించారు. గల్వాన్ వీరులకు నివాళులర్పించిన అనంతరం ఘటనలో గాయపడ్డ జవాన్లను పరామర్శించారు. అనంతరం చైనానుద్దేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.
12:47 July 05
రాష్ట్రపతిని కలిసిన ప్రధాని మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిశారు. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యాంశాలపై ఇరువురూ రాష్ట్రపతి భవన్లో చర్చించారు. లద్దాఖ్ లేహ్‌లో ప్రధాని.. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.