రాజ్యసభకు నూతన మంత్రిమండలిని ప్రధాని నరేంద్ర మోదీ పరిచయం చేశారు. ప్రతి ఒక్కరి పేరు, శాఖను ప్రస్తావించారు. అనంతరం సభను ఛైర్మన్ వెంకయ్య నాయుడు రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.
మంత్రి మండలి పరిచయం- రాజ్యసభ వాయిదా - మండలి
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన తర్వాత మంత్రి మండలిని ప్రధాని రాజ్యసభకు పరిచయం చేశారు. అనంతరం రేపు ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్యనాయుడు.
మంత్రి మండలిని పరిచయం చేస్తోన్న ప్రధాని
అంతకుముందు సభ్యుందరిని కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని ప్రభుత్వం కోరింది. 16వ లోక్సభ రద్దు చేసే సమయానికి రాజ్యసభలో 33 బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఆ బిల్లులను ఈ సెషన్లో ఆమోదించేందుకు ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ బిల్లులన్నీ 16వ లోక్సభలో ఆమోదం పొందాయి.
ఈ సెషన్ జులై 26 వరకు కొనసాగనుంది. మొత్తం 27 సార్లు రాజ్యసభ సమావేశం కానుంది.
- ఇదీ చూడండి: నవభారత నిర్మాణమే సర్కారు లక్ష్యం: రాష్ట్రపతి