దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రాల్లోని పరిస్థితులు, త్వరలో 21 రోజుల లాక్డౌన్ ముగుస్తుండటం వంటి అంశాలపై చర్చించారు ప్రధాని.
ఈ భేటీ అనంతరం మోదీ మరోమారు జాతినుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. లాక్డౌన్ను మరికొన్ని రోజులు పొడిగిస్తారని ప్రభుత్వ వర్గాలు ఇప్పటికే పరోక్షంగా సంకేతాలు ఇచ్చాయి. అయితే ఆంక్షల విషయంలో ఈ సారి అనేక మార్పులు చేస్తారని తెలుస్తోంది.