కేంద్ర బడ్జెట్‌లో ఈసారి ప్రధానమంత్రి రక్షణ కోసం ఉండే ప్రత్యేక రక్షణ బృందాని(ఎస్పీజీ)కి కేటాయించాల్సిన నిధులను మరింత పెంచారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ.540 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.60కోట్లు పెంచి మొత్తం రూ.600కోట్లు కేటాయించారు. అంతకు ముందు ఏడాది రూ.420 కోట్లు ఉండగా దాన్ని గతేడాది బడ్జెట్‌లో రూ.540 కోట్లకు పెంచారు. భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం దేశంలోనే అత్యధికంగా 3వేల మంది ప్రత్యేక భద్రతా సిబ్బందితో రక్షణ పొందుతున్నారు.
ప్రధాని మోదీ భద్రతకు బడ్జెట్లో రూ.600 కోట్లు - ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి రక్షణ కోసం ఉండే ప్రత్యేక రక్షణ బృందానికి (ఎస్పీజీ)కి కేంద్ర బడ్జెట్‌లో ఈసారి రూ.600కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్‌లో రూ. 540కోట్లు కేటాయించారు.
ప్రధాని మోదీ భద్రతకు రూ.600 కోట్లు
గతేడాది నవంబర్‌లో సోనియా గాంధీ కుటుంబసభ్యులకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించారు. ఎస్పీజీ భద్రతను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ మరణానంతరం ప్రధానుల రక్షణ కోసం 1985లో ఏర్పాటు చేశారు. అనంతరం 1991లో రాజీవ్‌గాంధీ హత్యతో ఎస్పీజీ భద్రత ప్రధానుల కుటుంబానికి సైతం వర్తించేలా మార్పులు చేశారు.
ఇదీ చూడండి : నిర్భయ దోషుల ఉరిపై రేపు దిల్లీ హైకోర్టు నిర్ణయం!
Last Updated : Feb 28, 2020, 8:09 PM IST