తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు

తమిళనాడులోని ఓ గ్రామంలో అమ్మవారి పూజలో భాగంగా తలపై ప్రధాన పూజారితో కొబ్బరికాయలు పగలకొట్టించుకున్నారు భక్తులు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని వారి విశ్వాసం. గాయాలైనా చికిత్సకు అసుపత్రికి వెళ్లరు భక్తులు.

తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు

By

Published : Aug 14, 2019, 6:53 PM IST

Updated : Sep 27, 2019, 12:37 AM IST

తమిళనాడులోని కులితలాయ్‌కు సమీపంలోని మెట్టు మహాదానపురంలో కురుంబా గిరిజన పండగను ఘనంగా నిర్వహించారు. ఆడి పండగలో భాగంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి భక్తుల చేతులపై కొరడాతో కొట్టారు. అనంతరం సంప్రదాయం ప్రకారం భక్తుల తలపై కొబ్బరి కాయలు పగలగొట్టారు.

తలపై కొబ్బరి కాయలు పగలకొట్టించుకుంటే అమ్మవారు మంచి చేస్తారని భక్తుల విశ్వాసం.

నేటి ఉత్సవాల్లో 20 మంది వరకూ గాయపడ్డారు. వారికి వైద్యం చేసేందుకు పోలీసులు ఆంబులెన్స్‌లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినప్పటికీ.... అమ్మవారికి కోపం వస్తుందనే భయంతో భక్తులు చికిత్స చేయించుకునేందుకు ముందుకు రాలేదు. గాయాలకు పసుపు, విభూతి మాత్రమే రాసుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు.

తలపై కొబ్బరికాయలు కొట్టించుకుని మొక్కులు

ఇదీ చూడండి: వైరల్​: లంచం కోసం లాఠీలతో ఖాకీల ఫైట్!

Last Updated : Sep 27, 2019, 12:37 AM IST

ABOUT THE AUTHOR

...view details