తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విషమంగా జైట్లీ ఆరోగ్యం- రాష్ట్రపతి పరామర్శ - ఆరోగ్యం

శ్వాస సంబంధిత సమస్యతో ఎయిమ్స్​లో చేరిన కేంద్ర మాజీ మంత్రి జైట్లీ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రపతి కోవింద్​ శుక్రవారం ఎయిమ్స్​కు వెళ్లి జైట్లీని పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

విషమంగా జైట్లీ ఆరోగ్యం- రాష్ట్రపతి పరామర్శ

By

Published : Aug 16, 2019, 3:25 PM IST

Updated : Sep 27, 2019, 4:53 AM IST

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉంది. శ్వాస సంబంధిత సమస్యతో ఈ నెల 9న దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు జైట్లీ. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉన్నారు.

రాష్ట్రపతి పరామర్శ...

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం ఉదయం ఎయిమ్స్​లో 66 ఏళ్ల జైట్లీని పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కోవింద్​తో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్​, ఆరోగ్య సహాయమంత్రి అశ్విని చౌబే ఉన్నారు.

గత శనివారం జైట్లీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పరామర్శించారు. అనంతరం మాజీ ఆర్థిక మంత్రి ఆరోగ్యం మెరుగుపడుతోందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

ఇదీ చూడండి:- గర్భవతి భార్య సహా కుటుంబాన్ని చంపి ఆత్మహత్య

Last Updated : Sep 27, 2019, 4:53 AM IST

ABOUT THE AUTHOR

...view details