2019 సార్వత్రిక ఎన్నికల అనంతరం కొలువుదీరిన 17వ లోక్సభలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తొలిసారి ప్రసంగించారు. తొలుత నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు కోవింద్. ఎన్నికలను సక్రమంగా నిర్వహించినందుకు ఎన్నికల సంఘానికి అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యాఖ్యానించారు.
సర్కారు లక్ష్యం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్: కోవింద్ - పార్లమెంటు
17వ లోక్సభ ఏర్పాటైన తొలిసారి పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ప్రభుత్వం 'సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్' అనే లక్ష్యంతో ముందుకెళ్లనుందని ప్రసంగంలో రాష్ట్రపతి ఉద్ఘాటించారు.
రామ్నాథ్ కోవింద్
ప్రభుత్వం జులై 5న పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి మాట్లాడారు.ఈ సారి ఎన్నికల్లో 61 కోట్ల మంది భారతీయులు ఓటు హక్కు వినియోగంచుకోవడంపై రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు.
Last Updated : Jun 20, 2019, 1:13 PM IST