తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జైట్లీ పరిస్థితి విషమం! రాష్ట్రపతి పరామర్శ - ఆరోగ్యం

ఎయిమ్స్​లో జైట్లీని పరామర్శించిన రాష్ట్రపతి

By

Published : Aug 16, 2019, 12:19 PM IST

Updated : Sep 27, 2019, 4:30 AM IST

14:08 August 16

విషమంగా జైట్లీ ఆరోగ్యం

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి అరుణ్​ జైట్లీ ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు సమాచారం. శ్వాస సంబంధిత సమస్యతో ఈ నెల 9న దిల్లీలోని ఎయిమ్స్​లో చేరారు జైట్లీ. అప్పటి నుంచి ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఐసీయూలోనే ఉన్నారు.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం ఉదయం ఎయిమ్స్​లో 66 ఏళ్ల జైట్లీని పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ సమయంలో కోవింద్​తో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్ష వర్ధన్​, ఆరోగ్య సహాయమంత్రి అశ్విని చౌబే ఉన్నారు.

13:59 August 16

విషమంగా జైట్లీ ఆరోగ్యం!

జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉనట్టు సమాచారం. ప్రస్తుతం ఆయన ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్నారు.

12:05 August 16

ఎయిమ్స్​లో జైట్లీని పరామర్శించిన రాష్ట్రపతి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ శుక్రవారం ఉదయం దిల్లీ ఎయిమ్స్​లో చికిత్సపొందుతున్న మాజీ కేంద్ర మంత్రి అరుణ్​ జైట్లీని పరామర్శించారు. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని ఆకాంక్షించారు.

66 ఏళ్ల జైట్లీ... శ్వాస సంబంధిత సమస్యతో ఈ నెల 9న ఎయిమ్స్​లో చేరారు.

Last Updated : Sep 27, 2019, 4:30 AM IST

ABOUT THE AUTHOR

...view details