దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70కి గాను 62 స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్‌ను దిల్లీ నూతన ముఖ్యమంత్రిగా నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. రామ్‌లీలా మైదానంలో ఆదివారం జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేజ్రీవాల్‌తో పాటు మరో ఆరుగురు మంత్రులు బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఆరుగురు మంత్రులు వీళ్లే..
ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్న మనీశ్ సిసోడియా సహా సత్యేందర్ జైన్, గోపాల్ రాయ్, ఖలాశ్, గహ్లెత్, ఇమ్రాన్ హుస్సేన్, రాజేంద్ర గౌతమ్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు.
ప్రసుత్తం దిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేశారని... అందుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపినట్లు మరో ప్రకటనలో తెలిపింది రాష్ట్రపతి భవన్. బాధ్యతలు చేపట్టేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్రపతి సూచించినట్లు పేర్కొంది.