తెలంగాణ

telangana

ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

92 ఏళ్ల వయసులో తమిళ పురాతన యుద్ధ కళ సిలంబం తరగతులు నిర్వహిస్తున్నాడో తాత. మరుగునపడిన కళకు మళ్లీ జీవం పోయడమే కాదు, మహిళలు, ఐటీ ఉద్యోగులకు ఆత్మరక్షణ నేర్పుతున్నాడు.

By

Published : Aug 3, 2020, 10:10 AM IST

Published : Aug 3, 2020, 10:10 AM IST

preserving-for-posterity-nonagenarian-teaches-silambam-the-ancient-tamil-martial-art
ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

అరవై దాటితే చాలు 'వయసైపోయింది.. ఇప్పుడేం చేయగలం.. కృష్ణా రామా అంటూ ఇంట్లో కూర్చోవడం తప్ప!' అనుకుంటారు చాలామంది. కానీ, తొంభై ఏళ్లు పైబడినా.. తరువాతి తరానికి సంప్రదాయ సిలంబం (కర్రసాము) యుద్ధకళను నేర్పుతున్నాడు తమిళనాడుకు చెందిన దురాయిరాజ్.

ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!
ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

రామనాథపురం జిల్లా, పెరాజ్ యుర్ తాలూకా, సిరుమనియెంతల్ గ్రామానికి చెందిన దురాయిరాజ్... సిలంబం విద్యలో తనకు తానే సాటి. 24వ ఏట కర్రతో దోస్తీ కుదిరింది. దాదాపు 370 పోటీల్లో సత్తా చాటాడు. అయితే, కొన్నేళ్ల క్రితం నుంచి సిలంబం సాధన చేయడం మానేశాడు దురాయిరాజ్ .

ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

కరోనా మహమ్మారిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వేళ దురాయిరాజ్ గ్రామంలో ఖాళీగా ఉంటున్న యువత, మహిళలను చూశాడు. మరుగునపడిన సిలంబం కళను ఈ తరానికి నేర్పించాలని నిర్ణయించుకున్నాడు. తనయుడు తిరుపతి సహకారంతో గ్రామంలో ఓ శిక్షణా మైదానం ఏర్పాటు చేశాడు. పురుషులు, మహిళలు అని తేడా లేకుండా ఉదయం, సాయంత్రం రెండు సెషన్ల శిక్షణ ప్రారంభించాడు.

ఈ తరానికి కర్రతో చెలిమి నేర్పుతున్న 92 ఏళ్ల తాత!

వయసుతో సంబంధం లేకుండా రఫ్పాడిస్తున్న తాత ఆశయం చుట్టుపక్కల గ్రామాలకు తెలిసింది. దీంతో, ఆత్మరక్షణకు ఉపయోగపడే సిలంబం విద్యను నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు మహిళలు. ఇప్పుడు విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, గృహిణులు సైతం దురాయిరాజ్ తాత శిష్యులే. అయితే, ఈ కళను సజీవంగా ఉంచాలంటే ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్నాడు ఆయన.

" ఏళ్ల క్రితం మన మహిళలు ఈ విద్యను నేర్చుకుని బ్రిటిష్ పాలకులతో పోరాడారు. కానీ, ఈ పురాతన సంప్రదాయ యుద్ధ కళ ఇప్పడు కనుమరుగవుతోంది. కాబట్టి, సిలంబం విద్యను కాపాడుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. "

-దురాయిరాజ్, కర్రసాము గురువు

ఇదీ చదవండి: హనుమంతునికి 7 అడుగుల పొడవైన రాఖీ!

ABOUT THE AUTHOR

...view details