తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఓటు స్లిప్పుల లెక్కపై మా పద్ధతే ఉత్తమం' - OPPOSITION

వీవీప్యాట్​ రసీదుల లెక్కింపునకు ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతే సరైనదని సుప్రీంకోర్టుకు వివరించింది భారత ఎన్నికల సంఘం. ఒక్కో నియోజకవర్గంలో 50 శాతం ఓటింగ్ యంత్రాల స్లిప్పులను లెక్కించాలన్న 21 ప్రతిపక్ష పార్టీల పిటిషన్​పై ఈసీ ప్రమాణపత్రం సమర్పించింది.

ఓటు స్లిప్పుల లెక్కపై ప్రస్తుత పద్ధతే ఉత్తమం

By

Published : Mar 29, 2019, 3:30 PM IST

Updated : Mar 29, 2019, 4:17 PM IST

వీవీప్యాట్​ రసీదుల లెక్కింపుపై ఎన్నికల సంఘం వివరణ
వీవీప్యాట్​ రసీదుల లెక్కింపుపై సుప్రీంకోర్టులో అఫిడవిట్​ దాఖలు చేసింది భారత ఎన్నికల సంఘం. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి ఒక్కో వీవీప్యాట్​ ఓటింగ్​ యంత్రంలోని రసీదులను లెక్కించే ప్రస్తుత పద్ధతే సరైనదని అభిప్రాయపడింది.

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని 50 శాతం ఓటింగ్​ యంత్రాల వీవీప్యాట్​ స్లిప్పులను లెక్కించాలని ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో 21 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ప్రతిపక్షాల పిటిషన్​పై స్పందించాలని ఈ నెల 25న ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది కోర్టు.

ఎన్నికల నిర్వహణపై వచ్చిన పిటిషన్లను అధ్యయనం చేసినట్లు అఫిడవిట్​లో పేర్కొంది ఎన్నికల సంఘం. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను పిటిషనర్లుచూపలేకపోయారని వివరించింది. రాబోయే ఎన్నికలకూ ప్రస్తుత పద్ధతే సరైనదని నివేదించింది. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడానికి సలహాలు స్వీకరిస్తామని తెలిపింది.

Last Updated : Mar 29, 2019, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details