కరోనా నియంత్రణ కోసం భారత్ బయోటెక్ రూపొందించిన కొవాగ్జిన్ టీకా రెండో దశ ప్రయోగాలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనేశ్వర్ ఐఎంఎస్-ఎస్యూఎమ్ ఆస్పత్రి ప్రతినిధులు వెల్లడించారు.
"మనుషులపై కొవాగ్జిన్ రెండో దశ ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తున్నాం . తొలి దశలో కొవాగ్జిన్ ప్రయోగించిన వలంటీర్ల రక్తం నమూనాలు స్వీకరించాం. వారిపై వ్యాక్సిన్ ఎలాంటి ప్రభావం చూపిందో అధ్యయనం చేస్తున్నాం. వ్యాక్సిన్ తీసుకున్నాక యాంటీబాడీలు ఏ మేరకు వృద్ధి చెందాయో పరిశీలించాం. ఇప్పటివరకైతే తొలి వ్యాక్సిన్ పొందినవారిపై ఎలాంటి దుష్ప్రభావం కనిపించలేదు. "