తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు 'భారతరత్న' అందుకోనున్న ప్రణబ్​

దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను మాజీ రాష్ట్రపతి  ప్రణబ్​ ముఖర్జీ ఈ రోజు అందుకోనున్నారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఏడాది జనవరి 25న ప్రణబ్​తో పాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్​ముఖ్​, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపెన్​ హజారికాలకు పురస్కారం ప్రకటించింది ప్రభుత్వం.

నేడు 'భారతరత్న' అందుకోనున్న ప్రణబ్​ ముఖర్జీ

By

Published : Aug 8, 2019, 11:25 AM IST

భారత మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్​ సీనియర్​ నేత ప్రణబ్​ ముఖర్జీకి నేడు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయనున్నారు. దిల్లీలో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.

ఈ ఏడాది జనవరి 25న భారతరత్న పురస్కారంపై ప్రకటన విడుదల చేసింది రాష్ట్రపతి భవన్​. ప్రణబ్​ ముఖర్జీతో పాటు సామాజిక కార్యకర్త నానాజీ దేశ్​ముఖ్​, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపెన్​ హజారికాలకు ఈ అవార్డును ప్రకటించింది.

భారతరత్న పురస్కారం పొందిన అయిదవ రాష్ట్రపతిగా గుర్తింపు పొందారు 'దాదా'. అంతకుముందు మాజీ రాష్ట్రపతులు డా.ఎస్​ రాధాక్రష్ణన్​, రాజేంద్రప్రసాద్​, జాకిర్​ హుస్సేన్​, వీవీ గిరిలు ఈ పురస్కారం అందుకున్నారు.

2012-2017 మధ్య భారత 13వ రాష్ట్రపతిగా సేవలందించారు ప్రణబ్​. 2009-2012 వరకు యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఐదు దశాబ్దాలుగా రాజకీయాల్లో ప్రణబ్ ముఖర్జీ​ చేసిన సేవలకు గాను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

ఇదీ చూడండి: నేడు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని!

ABOUT THE AUTHOR

...view details