ఎన్నో పదవులను అలంకరించి దేశానికి, పార్టీకి సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీకి ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని కాంగ్రెస్ తెలిపింది. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ట్విట్టర్లో వీడియో విడుదల చేసింది. అయన భరతమాత ముద్దబిడ్డ అంటూ కాంగ్రెస్ కొనియాడింది.
భరతమాత ముద్దుబిడ్డ ప్రణబ్: కాంగ్రెస్ - pranab died
22:23 August 31
భరతమాత ముద్దు బిడ్డ
19:44 August 31
ఒక శకం ముగిసింది: బంగాల్ సీఎం మమత
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మృతిపై బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం తెలిపారు. ప్రణబ్ మృతితో ఒక శకం ముగిసింది అన్నారు.
19:41 August 31
లోక్‌సభ స్పీకర్, నడ్డా ఏచూరి సంతాపం
- ప్రణబ్ మృతి పట్ల భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్ర సంతాపం
- ప్రణబ్ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై సంతాపం వ్యక్తం చేసిన సీతారాం ఏచూరి
19:05 August 31
జాతి యావత్తూ ఘన నివాళి అర్పిస్తోంది: రాహుల్ గాంధీ
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి
- ప్రణబ్ మృతిపై జాతి యావత్తూ ఘన నివాళి అర్పిస్తోంది: రాహుల్ గాంధీ
- ప్రణబ్ ముఖర్జీ కుటుంబసభ్యులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి: రాహుల్
18:57 August 31
జాతీయజెండా అవనతం
భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మృతి నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజుల పాటు సంతాప దినాలుగా కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ సహా అన్ని కార్యాలయాలపై జాతీయజెండా అవనతం చేయున్నట్లు పేర్కొంది. అధికారిక లాంఛనాలతో ప్రణబ్ ముఖర్జీకి కడసారి వీడ్కోలు పలికేందుకు రక్షణశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
18:34 August 31
మేధావిని ఈ దేశం కోల్పోయింది: మోదీ
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
- భారతరత్న ప్రణబ్‌ను కోల్పోయి దేశం దుఃఖసాగరంలో ఉంది: మోదీ
- గొప్ప రాజనీతిజ్ఞుడు, మేధావిని ఈ దేశం కోల్పోయింది: మోదీ
- దేశాభివృద్ధిలో ప్రణబ్ ప్రముఖ పాత్ర పోషించారు: మోదీ
- రాజకీయాలు, వర్గాలకు అతీతంగా అందరికీ ప్రణబ్ ఆరాధ్యుడు: మోదీ
- ప్రధాని బాధ్యతల స్వీకరణ సమయంలో ప్రణబ్ ఆశీర్వదించారు: మోదీ
- 2014లో దిల్లీ వచ్చినప్పుడు ప్రణబ్ నాకు మార్గదర్శనం చేశారు: మోదీ
18:24 August 31
దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయింది: అమిత్ షా
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై హోంమంత్రి అమిత్ షా తీవ్ర సంతాపం
- ప్రణబ్ ముఖర్జీ మాతృభూమికి ఎనలేని సేవలు అందించారు: అమిత్ షా
- ప్రణబ్ మృతితో దేశం గొప్ప రాజకీయ నేతను కోల్పోయింది: అమిత్ షా
18:16 August 31
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం
- ప్రణబ్ మృతితో పెద్ద రాజనీతిజ్ఞుడిని ఈ దేశం కోల్పోయింది: వెంకయ్యనాయుడు
- కఠోర శ్రమ, క్రమశిక్షణ, అంకితభావంతో ప్రణబ్ ఉన్నత శిఖరాలకు చేరారు: వెంకయ్య
18:13 August 31
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం
- ప్రణబ్ ముఖర్జీ మృతిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతాపం
- ప్రణబ్ ముఖర్జీ మృతితో ఒక శకం ముగిసింది: రాష్ట్రపతి కోవింద్
- ప్రణబ్ దేశానికి ఎన్నో రకాల సేవలు అందించారు: రాష్ట్రపతి
- గొప్ప కుమారుడు కన్నుమూతపై ఈ దేశం విలపిస్తోంది: రాష్ట్రపతి
17:53 August 31
- మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ (84) కన్నుమూత
- దిల్లీ సైనిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస
- ప్రణబ్ మెదడులో కణితి ఏర్పడటంతో శస్త్రచికిత్స చేసిన వైద్యులు
- ప్రణబ్‌కు కరోనా కూడా సోకడంతో చికిత్స అందించిన వైద్యులు
- ఈనెల 10న మధ్యాహ్నం ఆస్పత్రిలో చేరిన ప్రణబ్ ముఖర్జీ
- 1935 డిసెంబర్ 11న బంగాల్‌లోని మిరాఠీలో జన్మించిన ప్రణబ్
- స్వాతంత్ర్య పోరాటంలో చురుగ్గా పాల్గొన్న ప్రణబ్ తండ్రి కె.కె.ముఖర్జీ
- కోల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రం పట్టా అందుకున్న ప్రణబ్
- 1957 జులై 13న సువ్రా ముఖర్జీని వివాహమాడిన ప్రణబ్ ముఖర్జీ
- 2015లో అనారోగ్యంతో మృతిచెందిన ప్రణబ్ సతీమణి సువ్రా ముఖర్జీ
- క్లర్క్ స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు సాగిన ప్రణబ్ ప్రస్థానం
- రాజకీయ ప్రవేశానికి ముందు పలు ఉద్యోగాలు చేసిన ప్రణబ్
- మొదట క్లర్క్‌గా, ఆ తర్వాత ఉపాధ్యాయుడిగా పనిచేసిన ప్రణబ్
- దెషర్ దక్ పత్రికకు పాత్రికేయులుగానూ పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ
- సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక పదవులు అలంకరించిన ప్రణబ్
- 1969లో ఇందిరాగాంధీ హయాంలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ప్రణబ్
- 34 ఏళ్లకే పెద్దల సభలో అడుగుపెట్టిన ప్రణబ్ ముఖర్జీ
- 1973లో ఇందిరాగాంధీ హయాంలో తొలిసారి మంత్రివర్గంలో ప్రణబ్‌కు చోటు
- పరిశ్రమలశాఖ సహాయమంత్రిగా విధులు నిర్వహించిన ప్రణబ్ ముఖర్జీ
- 1975-77లో అంతర్గత అత్యవసర పరిస్థితిలో క్రియాశీలకంగా వ్యవహరించిన ప్రణబ్
- 1982లో 47 ఏళ్ల వయసులోనే కేంద్ర ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ
- ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక చక్రాలను పరుగులు పెట్టించిన ప్రణబ్ ముఖర్జీ
- 1982 నుంచి 1984 వరకు ఆర్థికమంత్రిగా కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ
- 1986లో రాష్ట్రీయ సమాజ్‌వాదీ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన ప్రణబ్
- రాజీవ్‌గాంధీ సూచనతో ఆర్‌ఎస్‌సీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన ప్రణబ్
- 1991 నుంచి 96 వరకు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రణబ్
- 1995లో విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ
- 1997లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు అందుకున్న ప్రణబ్
- కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యేలా సోనియాను ప్రోత్సహించిన ప్రణబ్
- క్లిష్ట సమయాల్లో మార్గనిర్దేశం చేసిన ప్రణబ్ ముఖర్జీ
- 5 దశాబ్దాల రాజకీయ జీవితంలో పార్టీలో ఎన్నో సమస్యలు పరిష్కరించిన ప్రణబ్
- గాంధేయవాదిగా, కరడుకట్టిన కాంగ్రెస్ వాదిగా మచ్చలేని నేతగా ప్రణబ్
- యూపీఏ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన ప్రణబ్
- 2004 నుంచి 2006 వరకు రక్షణ మంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ
- 2006 నుంచి 2009 వరకు విదేశీ వ్యవహరాల మంత్రిగా పనిచేసిన ప్రణబ్
- 2009 నుంచి 2012 వరకు ఆర్థికమంత్రిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ
- కాంగ్రెస్‌లో వివాద పరిష్కర్తగా పేరు గడించిన ప్రణబ్ ముఖర్జీ
- 2012 జులై 25న భారత 13వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ప్రణబ్
- 2017 వరకు రాష్ట్రపతి పదవిలో కొనసాగిన ప్రణబ్ ముఖర్జీ
- 2008లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న ప్రణబ్ ముఖర్జీ
-
2019లో దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అందుకున్న ప్రణబ్
17:49 August 31
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూశారు.