తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సాధ్వి ప్రజ్ఞ కంటతడి.. ఉమాభారతి ఓదార్పు - లోక్​సభ

భోపాల్​ లోక్​సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న సాధ్వి ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్​ కంటతడి పెట్టారు. కేంద్రమంత్రి ఉమాభారతితో సమావేశం అనంతరం ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. ప్రజ్ఞాను ఉమాభారతి ఓదార్చారు.

ప్రజ్ఞను ఓదారుస్తున్న ఉమాభారతి

By

Published : Apr 29, 2019, 5:29 PM IST

సాధ్వి ప్రజ్ఞ కంటతడి.. ఉమాభారతి ఓదార్పు

భాజపా నేత, మధ్యప్రదేశ్​లోని భోపాల్​ లోక్​సభ అభ్యర్థి సాధ్వి ప్రజ్ఞా సింగ్​ ఠాకూర్​ మీడియా ముందే కంటతడి పెట్టారు. భోపాల్​లో కేంద్రమంత్రి ఉమాభారతితో సమావేశం అనంతరం కారులో బయల్దేరుతున్న సమయంలో ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

భోపాల్​ నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్న ఉమాభారతి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆ స్థానంలో ప్రజ్ఞా బరిలో ఉన్నారు. మాలేగావ్​ పేలుళ్లు కేసులో ఇటీవలే ప్రజ్ఞ విడుదయ్యారు.

నేడు ఇద్దరూ భేటీ అయ్యారు. సమావేశం తర్వాత బయల్దేరుతున్న సమయంలో కంటతడిపెట్టిన ప్రజ్ఞను ఓదార్చారు కేంద్రమంత్రి ఉమాభారతి.
అభ్యర్థిగా ప్రజ్ఞా ఠాకూర్​ను పార్టీ ప్రకటించిన రోజునే విజయం తథ్యమైందన్నారు ఉమాభారతి. పార్టీ నిర్ణయమేదైనా తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ సీనియర్​ నేత దిగ్విజయ్​ సింగ్​తో పోటీ పడుతున్నారు ప్రజ్ఞ.

ABOUT THE AUTHOR

...view details