తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వివాదాస్పదం: భాజపా ఎంపీ ప్రగ్యా​ సంచలన వ్యాఖ్యలు - లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యం

భాజపా ఎంపీ ప్రగ్యాసింగ్​ ఠాకూర్​ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు వరుసగా మృతి చెందుతుండటం వెనుక ప్రతిపక్షాల కుట్ర ఉందని ఆరోపించారు ప్రగ్యాసింగ్​. ఈ విషయం తనకు ఓ యోగి చెప్పారని జైట్లీ సంస్మరణ సభలో తెలిపారు.

భాజపా ఎంపీ ప్రగ్యా​ సంచలన వ్యాఖ్యలు

By

Published : Aug 26, 2019, 8:00 PM IST

Updated : Sep 28, 2019, 9:09 AM IST

భాజపా ఎంపీ ప్రగ్యా​ సంచలన వ్యాఖ్యలు

భారతీయ జనతా పార్టీ నేతలు వరుసగా మృతి చెందుతుండటం వెనుక ప్రతిపక్ష పార్టీల కుట్ర ఉందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు కాషాయ పార్టీ ఎంపీ ప్రగ్యాసింగ్​ ఠాకూర్​.

కమలం నేతలకు హాని తలపెట్టేందుకు ప్రతిపక్షాలు క్షుద్రశక్తులు ఉపయోగిస్తున్నాయని ఆరోపించారామె. లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో త‌న‌కు ఓ యోగి ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు ప్రగ్యా సింగ్‌ తెలిపారు. భాజపాకు గడ్డు సమయం రానుందని... కమలం పార్టీని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు తాంత్రిక శక్తుల్ని ఉపయోగిస్తాయని ఆ యోగి చెప్పినట్లు పేర్కొన్నారు ప్రగ్యా.

అయితే... ఆ విషయాన్ని అప్పుడే మరచిపోయానన్న ప్రగ్యాసింగ్‌.. పార్టీ నేతలు ఒక్కొక్కరూ మ‌ర‌ణిస్తుంటే యోగి చెప్పిన విష‌యాలు అర్థమవుతున్నాయని వ్యాఖ్యానించారు. భోపాల్‌లో అరుణ్‌జైట్లీ, మ‌ధ్యప్రదేశ్ మాజీ సీఎం బాబులాల్ గౌర్‌ సంస్మరణ సభలో ప్రగ్యాసింగ్‌ ఈ సంచలన ఆరోపణలు చేశారు.

''మనకు చాలా కష్ట సమయం నడుస్తోంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఓ యోగి నాకు ఒక విషయం చెప్పారు. ఇది మీకు చాలా గడ్డు కాలమని చెప్పారు. విపక్షాలు.. భారతీయ జనతా పార్టీ నేతలపై క్షుద్ర శక్తులు ప్రయోగిస్తాయని ఆ యోగి చెప్పారు. ఎన్నికల ప్రచారంలో పడి నేను ఆ విషయాన్ని మర్చిపోయాను. సుష్మాస్వరాజ్‌, బాబులాల్ గౌర్‌, జైట్లీ వంటి భాజపా సీనియర్ నేతలు వరుసగా మృతి చెందుతున్నారు. ఈ మరణాలు చూసినప్పుడు ఆ యోగి చెప్పింది నిజమే అని నాకు అనిపిస్తోంది.''

-ప్రగ్యాసింగ్‌ ఠాకూర్‌, భాజపా ఎంపీ

Last Updated : Sep 28, 2019, 9:09 AM IST

ABOUT THE AUTHOR

...view details