తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రపంచంలోని 15 కాలుష్య నగరాల్లో 14 మనవే - bharat

ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్​లోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది. ఇందులో ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్ ప్రథమ స్థానంలో నిలిచింది. హరియాణాలోని ఫరీదాబాద్ రెండోస్థానంలో నిలిచింది.

ప్రపంచంలోని 15 కాలుష్య నగరాల్లో 14 మనవే

By

Published : Apr 10, 2019, 11:58 PM IST

భారత్​లో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతుందా అంటే అవుననే అంటోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. 2014-2019 మధ్య వాతావరణ పరిస్థితులపై నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికలో ఉత్తరప్రదేశ్​లోని కాన్పూర్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ప్రథమ స్థానంలో నిలిచింది. హరియాణాలోని ఫరీదాబాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆధ్యాత్మిక నగరం వారణాసి వరసగా రెండు, ముూడు స్థానాల్ని పొందాయి. దేశ రాజధాని దిల్లీ ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలోని 15 అత్యంత కాలుష్య నగరాల జాబితాలో 14 భారత్​కు చెందినవే ఉన్నాయి.

ప్రపంచంలోని 15 కాలుష్య నగరాల్లో 14 మనవే

వివిధ స్థానాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని నివేదిక అభిప్రాయపడింది.

అత్యంత కాలుష్య నగరాల్లో ప్రముఖుల నియోజకవర్గాలు...

వారణాసి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఇది ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో మూడో స్థానంలో ఉంది. కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్పూర్ ప్రథమ స్థానంలో ఉంది.

గయా, పట్నా నగరాలు వరసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఆగ్రా, ముజఫర్​పూర్, శ్రీనగర్​, గురుగ్రామ్, జైపుర్, పాటియాలా, జోధ్​పూర్​ అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details