సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్‌లోనూ బంగాల్లో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బసిర్‌హట్‌లోని పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు నిరసనలకు దిగారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ ఆందోళన చేపట్టారు.
తుది విడత పోలింగ్: బంగాల్లో ఉద్రిక్తత - బంగాల్
చివరి విడత పోలింగ్‌లోనూ బంగాల్లో అక్కడక్కడ ఘర్షణలు జరుగుతున్నాయి. తమను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ బసిర్‌హట్‌లో ఓ పోలింగ్ కేంద్రం ముందు బైఠాయించారు ఓటర్లు.
బంగాల్లో అల్లర్లు
సుమారు 100 మందితో కూడిన తృణమూల్ బృందం.. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆరోపించారు అక్కడి భాజపా అభ్యర్థి సయంతన్ బసు. ఈయన వ్యాఖ్యల అనంతరం బంగాల్ బసిర్‌హట్‌లోని 189 వ పోలింగ్ కేంద్రం వద్ద అదనపు బలగాలు మోహరించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చి... సజావుగా పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.