లోక్సభ ఎన్నికల్లో పార్టీ తక్కువ స్థానాలు సాధించడం వల్ల అనూహ్య నిర్ణయం తీసుకున్నారు పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ. సిట్టింగ్ స్థానాలు కోల్పోవటం కారణంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ పార్టీ నేతలు వ్యతిరేకించడం వల్ల రాజీనామాపై వెనక్కితగ్గారు దీదీ.
ఫలితాల తర్వాత పార్టీ నేతలతో సమావేశమయ్యారు దీదీ. భేటీ అనంతరం మీడియాతో పలు అంశాలపై మాట్లాడారు.
"సీఎం పదవికి రాజీనామా చేయాలనుకున్నా. ఆ కుర్చీపై నాకు ఆశ లేదు. కానీ పార్టీ నా నిర్ణయాన్ని తిరస్కరించింది. సీఎం పదవి నాకు అవసరం లేదు. కానీ నేను ఆ స్థానానికి అవసరం. ఇన్ని రోజులు ప్రజల కోసం సేవ చేశాను. పార్టీ కోసం చేయాల్సిన సమయం వచ్చింది."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి