ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఇటావా జిల్లా జైల్లో ఖైదీల జూద క్రీడలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. రోజుకు రూ. 2 లక్షల వరకు జూదం వ్యాపారం సాగుతుందిక్కడ. పోలీసులకు మామూళ్లు సమర్పించి.. ఖైదీలు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. వందో రెండొందలో చేతిలో పెడితే ఖైదీలతో దోస్తీ చేసేస్తారు ఇక్కడి పోలీసులు. ఈ జైల్లోకి ఏ వస్తువు కావాలన్న ఎలాంటి తనిఖీల బెడద లేకుండానే లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ ఖైదీలే క్యాంటీన్ నడుపుతున్నారంటేనే.. స్వేచ్ఛ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సీసీటీవీ భయమే ఉండదు. అవి ఎప్పుడూ పనిచేయవు. ఇక.. పై స్థాయి అధికారులు వస్తే ముందే సమాచారం అందుతుంది కాబట్టి కాస్త ముందుగానే జాగ్రత్త పడతారు.