తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాఠీచార్జీ వల్ల బాలింత మృతి ! - nakhuti

అసోంలో విషాదకర సంఘటన జరిగింది. పసిబిడ్డకు జన్మనిచ్చిన అనంతరం బాలింత మృతి చెందింది. పోలీసులు లాఠీఛార్జీ చేయడం వల్లే ఆమె మరణించిందని గ్రామస్థులు పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగారు.

పోలీసులు లాఠీ ఛార్జ్ కారణంగా బాలింత మృతి

By

Published : Mar 13, 2019, 5:06 PM IST

బాలింత మృతదేహంతో పోలీసుస్టేషన్​ ఎదుట గ్రామస్థుల ఆందోళన
బాలింత మృతితో అసోం కార్బీ ఆంగ్లోంగ్​ జిల్లా నఖుటి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిండు గర్భిణిగా ఉన్న కుల్సుమా బేగంపై పోలీసులు లాఠీఛార్జీ​ చేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ కారణంగానే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం ప్రసవం అనంతరం మృతి చెందిందని తెలిపారు.

కుల్సుమా మృతికి పోలీసులే కారణమంటూ గ్రామస్థులు మంగళవారం ఆందోళన చేపట్టారు. ఆమె మృతదేహంతో పోలీస్ స్టేషన్​ ముందు నిరసనకు దిగారు. బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.10 లక్షలు ప్రకటించాలని డిమాండ్​ చేశారు. బిడ్డ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు.

అటవీ ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నివాసముంటున్న వారిని ఖాళీ చేయించేందుకు కార్బీ ఆంగ్లోంగ్​ జిల్లా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 600పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అడ్డుపడిన గ్రామస్థులపై పోలీసులు లాఠీచార్డీ చేశారు. నిండు గర్భిణి అని చూడకుండా బేగంపైనా బాధ్యతారహితంగా వ్యవహరించారని స్థానికులు మండిపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details