తెలంగాణ

telangana

ఏటీఎంలో 'అది' చేశాడు... సస్పెండ్​ అయ్యాడు

By

Published : Sep 7, 2019, 5:38 PM IST

Updated : Sep 29, 2019, 7:16 PM IST

ఒడిశా బరిపాడలో ఓ పోలీసు కానిస్టేబుల్ మద్యం మత్తులో..ఏటీఎంలో మూత్రవిసర్జన చేశాడు. ఈ దృశ్యాన్ని ఓ స్థానికుడు చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశాడు. ఇది కాస్తా వైరల్​ అయిన నేపథ్యంలో పోలీసు అధికారులు విచారణ జరిపి.. ఆ కానిస్టేబుల్​ను సస్పెండ్ చేశారు.

ఏటీఎంలో 'అది' చేశాడు... సస్పెండ్​ అయ్యాడు

ఏటీఎంలో 'అది' చేశాడు... సస్పెండ్​ అయ్యాడు

మద్యం మత్తులో ఓ పోలీసు కానిస్టేబుల్​ చేసిన పని.. అతని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. ఎవరూ చూడలేదనుకుని ఏటీఎంలో మూత్రవిసర్జన చేసిన అతని వీడియో... సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అది కాస్తా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినందున.. ఈ ఘటనపై విచారణ జరిపారు. జుగుప్సాకరమైన పనిచేసినందుకు సమీర్​సేథీపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని సస్పెండ్ చేశారు.

ఇదీ జరిగింది..

ఒడిశా బరిపాడలో కానిస్టేబుల్​గా పనిచేస్తున్నాడు సమీర్​సేథీ. మద్యం మత్తులో ఎస్​బీఐ ఏటీఎం కియోస్కులో మూత్రం పోశాడు. ఎవరూ చూడలేదనుకున్నాడు సమీర్​. అయితే ఈ దృశ్యాన్ని స్థానిక వ్యక్తి సెల్​ఫోన్​లో చిత్రీకరించి, సమాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశాడు. అది కాస్తా వైరల్ అయ్యింది. ఫలితంగా సస్పెండ్​ అయ్యాడు.

ఇదీ చూడండి: రూ.100 లక్షల కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన

Last Updated : Sep 29, 2019, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details