మావోయిస్టులు పేలుడుకు పాల్పడిన మహారాష్ట్ర గడ్చిరోలిలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఘటనా స్థలం వద్ద డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. సమీప అటవీ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. మావోయిస్టుల కోసం వేట ప్రారంభించారు. చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ నక్సల్స్ కోసం విస్తృతంగా శోధిస్తున్నారు.
గడ్చిరోలిలో మావోల కోసం పోలీసుల వేట - gadchiroli
మహారాష్ట్రలోని గడ్చిరోలి ఐఈడీ పేలుడు జరిగిన ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భారీగా బలగాలను మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
గడ్చిరోలిలో మావోయిస్టుల కోసం పోలీసుల గాలింపు
బుధవారం రోజు మావోయిస్టులు ఐఈడీ పేలుడుకు పాల్పడిన ఘటనలో వాహనంలోని 15 మంది పోలీసులు, ఓ డ్రైవరు మృతి చెందారు. బాధ్యుల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదీ చూడండి: పోలీస్ బస్‌పై నక్సల్స్ దాడి- 16 మంది మృతి