అసంఘటిత రంగ కార్మికులు పింఛన్లు పొందడం కోసం కేంద్ర ప్రభుత్వం 'ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్‌ధన్' (పీఎంసీవైఎం) పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకంతో లబ్ధిపొందే వారి సంఖ్య ఏప్రిల్ నెలాఖరకు కోటి దాటే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. లబ్ధిదారులు 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెలకు 3 వేల చొప్పున ఫించను అందిస్తారు.
"ఈ పథకంలో ఇప్పటి వరకు 25 లక్షల 36 వేల మంది సభ్యులు చేరారు. రోజుకు లక్ష మంది కార్మికులను ఇందులో భాగస్వాములు చేస్తున్నాం. ఏప్రిల్ నెలాఖరకు కోటి మందిని చేరుస్తామనే నమ్మకం ఉంది."
- దినేష్ త్యాగి ,సీఎస్సీఈ - గవర్నెస్ సంస్థ ముఖ్యకార్య నిర్వాహణాధికారి.
దేశ వ్యాప్తంగా ఉన్న సీఎస్సీ (కామన్ సర్వీసు సెంటర్లు)లో దరఖాస్తులు సమర్పించి ఈ పథకంలో చేరవచ్చు.
డిసెంబర్ నెలాఖరు నాటికి పథకంలో చేరే వారి సంఖ్య 5 కోట్లు దాటవచ్చని దినేష్ త్యాగి తెలిపారు.