తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కశ్మీర్​'పై మోదీ ప్రకటనకు విపక్షాల​ డిమాండ్

జమ్ముకశ్మీర్​లో అదనపు బలగాల మోహరింపుపై తీవ్ర విమర్శలు చేసింది కాంగ్రెస్. గతంలో చాలాసార్లు యాత్రికులపై దాడులు జరిగినా.. ఏ యాత్రనూ రద్దు చేయలేదని గుర్తుచేసింది. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులపై పార్లమెంట్​లో ప్రధాని ప్రకటన చేయాలని డిమాండ్​ చేసింది.

'కశ్మీర్​'పై సభలో మోదీ ప్రకటనకు విపక్షాల​ డిమాండ్

By

Published : Aug 3, 2019, 5:33 PM IST

జమ్ముకశ్మీర్​లో తాజా పరిస్థితులపై పార్లమెంట్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటన చేయాలని డిమాండ్​ చేసింది కాంగ్రెస్. అదనపు బలగాల తరలింపుపై తీవ్ర విమర్శలు చేసింది.

బలగాల మోహరింపు ఎందుకు చేపడుతున్నారో స్పష్టతనివ్వాలని కోరారు ఆ పార్టీ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​. గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడూ ఇలా అదనపు బలగాలను మోహరించలేదన్నారు​. గత ప్రభుత్వాలు ఎప్పుడూ అమర్​నాథ్​ యాత్రను రద్దు చేయలేదని గుర్తు చేశారు.

మాట్లాడుతున్న ఆజాద్​

"నిన్న హోంశాఖ జారీ చేసిన ఆదేశం ఆందోళన కలిగించేలా ఉంది. దేశ ప్రజలతో పాటు జమ్ముకశ్మీర్​ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో వెయ్యికిపైగా ప్రదేశాల్లో సైన్యం ఉగ్రవాద డంపులను గుర్తించింది. చాలా ల్యాండ్​మైన్లు దొరికాయి. కానీ మేము ఎప్పుడూ ఏ యాత్రికులను వెళ్లిపోవాలని చెప్పలేదు. ఎలాంటి యాత్రను రద్దు చేయలేదు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్​లోని ప్రతి నాయకుడు కేంద్ర ప్రభుత్వం చర్యను ఖండిస్తున్నారు."
- గులాం నబీ ఆజాద్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత

రాజకీయ సాహసం చేయొద్దు: సీపీఐ

జమ్ముకశ్మీర్​ రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ సాహసం చేయొద్దని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికింది సీపీఎం. అలా కాదని ముందడుగు వేస్తే దేశంలో భయంకర పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించింది. అమర్​నాథ్​ యాత్ర అర్ధాంతరంగా నిలిపేయటం వల్ల రాష్ట్ర ప్రజల్లో ఆందోళన, ఉద్రిక్తతలు నెలకొన్నాయని ఓ ప్రకటనలో పేర్కొంది సీపీఎం. కశ్మీర్​లో తీసుకుంటున్న చర్యలపై ప్రభుత్వం సమాధానమివ్వాలని డిమాండ్​ చేసింది.

కశ్మీర్​ నేతలదీ అదే మాట...

కశ్మీర్​లోని తాజా పరిస్థితులపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన చేయాలని నేషనల్​ కాన్ఫరెన్స్​ నేత ఒమర్​ అబ్దుల్లా డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: 'ఆపరేషన్​ కశ్మీర్'పై నిఘా వర్గాల సమాచారం ఇదే!

ABOUT THE AUTHOR

...view details