ప్రధాని నరేంద్రమోదీ సోమవారం తను ఏ విధంగా ఫిట్‌గా ఉం
టారో తెలియజేయటం కోసం ట్విట్టర్లో త్రీడీ- యానిమేటెడ్ యోగా వీడియోలను పోస్ట్ చేశారు.
"నిన్న జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా నా ఫిట్నెస్ గురించి ఓ వ్యక్తి నన్ను అడిగారు. అందుకే నేను నా యోగా వీడియోలను పంచుకోవాలని అనుకుంటున్నాను. వీటిని చూసి మీరు కూడా రోజు యోగా ప్రారంభిస్తారని నమ్ముతున్నాను."
-నరేంద్రమోదీ, ప్రధాని.
ఆదివారం మనసులో మాట కార్యక్రమంలో "మీరు ఎలా ఇంత ఫిట్‌గా ఉంటారు" అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా 'యోగా విత్ మోదీ' వీడియోలను షేర్ చేసినట్లు తెలిపారు ప్రధాని
"కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి. నేను ఫిట్నెస్ నిపుణుడిని కాదు. యోగా గురువును అసలే కాదు. నేను యోగా అభ్యాసకుడిని మాత్రమే. కొన్ని యోగాసనాలు వల్ల నాకు చాలా ప్రయోజనం కలిగింది. ప్రస్తుత లాక్డౌన్ పరిస్థితుల్లో ఈ యోగా మీకు కూడా ప్రయోజనాలను చేకూర్చవచ్చు." అని ట్వీట్ చేశారు మోదీ.
ఇదీ చూడండి:తల్లి పాల ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందా?