తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వన భారతం: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు

జాతీయ పులుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా అఖిల భారత పులుల నివేదిక అంచనా-2018ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విడుదల చేశారు. దేశంలో 3 వేలకు పైగా పులులు ఉన్నాయని వెల్లడించారు. పెద్ద పులులకు భారత్ ప్రపంచంలోనే అతి సురక్షిత ప్రదేశమని స్పష్టం చేశారు.

వన భారతం: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు

By

Published : Jul 29, 2019, 11:19 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీ అఖిల భారత పులుల నివేదిక అంచనా 2018ని విడుదల చేశారు. భారత్​లో 3వేలకు పైగా పెద్ద పులులు ఉన్నాయని దిల్లీలో పేర్కొన్నారు ప్రధాని.

తొమ్మిదేళ్ల క్రితం రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ వేదికగా జరిగిన సదస్సులో 2022 నాటికి పులుల సంఖ్యను రెట్టింపు చేయాలని ప్రపంచస్థాయిలో లక్ష్యంగా పెట్టుకున్నామని గుర్తుచేశారు మోదీ. భారత్ నాలుగేళ్లలోనే ఈ ఘనత సాధించిందని వెల్లడించారు.

వన భారతం: ఐదేళ్లలో పులుల సంఖ్య రెట్టింపు

"పచ్చని పర్యావరణంతో కూడిన సుస్థిర దేశాన్ని నిర్మిద్దాం. పులులను బతకనిద్దాం. పులులకు సంబంధించి 'ఏక్​ థా టైగర్' నుంచి ప్రారంభించి 'టైగర్ జిందా హై' వరకు తీసుకొచ్చాం. అది ఇక్కడే ఆగిపోకూడదు. పులుల సంరక్షణ చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: మోదీ చిత్రాలతో ఇజ్రాయెల్​ ఎన్నికల ప్రచారం

ABOUT THE AUTHOR

...view details