నేడు మాజీ ప్రధాని, దివంగత నేత రాజీవ్‌గాంధీ 75వ జయంతి. ఈ సందర్భంగా దిల్లీలోని వీర్‌భూమి వద్ద ఆయన సతీమణి, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజీవ్‌కు పుష్పాంజలి ఘటించారు. కుమారుడు రాహుల్‌గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ తమ తండ్రికి నివాళులర్పించారు.
నేడు రాజీవ్‌గాంధీ జయంతి.. ప్రముఖుల ఘన నివాళి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా రాజీవ్‌గాంధీకి అంజలి ఘటించారు.
"మాజీ ప్రధాని శ్రీ రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు" - నరేంద్రమోదీ, ప్రధానమంత్రి.
రాజీవ్‌గాంధీకి మోదీ నివాళి
రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, రాజ్యసభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్ తదితరులు అంజలి ఘటించారు. రాజీవ్‌గాంధీ సేవలను స్మరించుకున్నారు.
సద్భావన దివస్
రాజీవ్‌గాంధీ 1944 ఆగస్టు 20న అప్పటి బొంబాయిలో జన్మించారు. ఆయన జయంతిని కాంగ్రెస్... 'సద్భావన దివస్'గా పాటిస్తోంది.
ఇదీ చూడండి: చందమామ కక్ష్యలోకి ప్రవేశించిన చంద్రయాన్-2