తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అర్ధరాత్రి వరకు సాగిన లోక్​సభ కార్యకలాపాలు - Prime Minister Office

loksabha
అర్ధరాత్రి వరకు సాగిన లోక్​సభ కార్యకలాపాలు

By

Published : Feb 8, 2021, 10:21 AM IST

Updated : Feb 9, 2021, 12:38 AM IST

00:30 February 09

అర్ధరాత్రి వరకు సాగిన లోక్​సభ కార్యకలాపాలు

లోక్​సభ కార్యకలాపాలు సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇవ్వాలని స్పీకర్​ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం.

సాధారణంగా లోక్​సభ కార్యకలాపాలు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సాగుతాయి.  

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 15 గంటలు కేటాయించారు. మంగళవారం కూడా ఇది కొనసాగుతుంది.

లోక్​సభ వాయిదా పడే కొద్ది క్షణాల ముందు.. మంగళ, బుధవారాల్లో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని స్పీకర్​ను కోరారు పార్లమెంట్​ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి. ధన్యవాద తీర్మానంలో అందరూ పాల్గొనేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు వెల్లడించారు. జోషి ప్రతిపాదనను స్పీకర్​ ఓం బిర్లా అంగీకరించారు.  

సాధారణంగా.. సాయంత్రం 4-5 గంటల మధ్య ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది.

21:22 February 08

ఈరోజు లోక్​సభ కార్యకలాపాలను అర్ధరాత్రి వరకు పొడిగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో అన్ని పార్టీల సభ్యులకు అవకాశం ఇవ్వాలని స్పీకర్​ ఈ నిర్ణయం తీసుకున్నారు.

17:36 February 08

లక్షలాది మంది రైతులు దిల్లీ సరిహద్దులో ఉద్యమం చేస్తుంటే తాము నిశబ్దంగా చూస్తూ కూర్చోలేమని లోక్​సభలో కాంగ్రెస్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధురీ పేర్కొన్నారు. 206 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దిల్లీలోకి ప్రవేశించకుండా రైతులను అడ్డుకుంటున్నారని, రోడ్లపై మేకులు కొడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రపతి ప్రసంగం తర్వాత సాగు చట్టాలపై చర్చించాలనేదే తమ డిమాండ్ అని పేర్కొన్నారు. 

అంతకుముందు మాట్లాడిన రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్... దేశ ప్రజాస్వామ్యం బలంగా ఉందని స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా దాన్ని అలాగే కొనసాగించాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రాజ్యాంగ సంస్థ గౌరవాన్ని నిలబెట్టడం మన కర్తవ్యమని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంపైనే సభ్యులు మాట్లాడాలని, ఇతర అంశాలపైకి విషయాన్ని మళ్లించవద్దని కోరారు.

16:13 February 08

లోక్​సభ మొదలైన 10 నిమిషాల్లోనే వాయిదా పడింది. నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని విపక్ష సభ్యులు నినాదాలు చేయడం వల్ల సభాపతి ఓం బిర్లా 5 గంటల వరకు లోక్​సభను వాయిదా వేశారు. 

11:30 February 08

సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం-రైతుల మధ్య అనేక దఫాల చర్చలు జరిపాయని చెప్పారు. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. వారి అభ్యంతరాలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే, రైతుల ఆందోళనలకు కారణం ఏంటో తెలియట్లేదని అన్నారు. చట్టాల్లో ఉన్న అభ్యంతరాలు ఏంటో చెప్పట్లేదని పేర్కొన్నారు. కనీస మద్దతు ధర(ఎంఎస్​పీ)కు ఢోకా ఉండదని చెప్పారు. ఎంఎస్​పీ ప్రస్తుతం ఉందని, ఇకపైనా కొనసాగుతుందని స్పష్టం చేశారు.

11:17 February 08

అవకాశాలు అందుకోవాలి: ప్రధాని

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం ఈ దశాబ్దానికే మార్గదర్శకమని కొనియాడారు. మన లక్ష్యాలను ఈ ప్రసంగం నిర్దేశించిందని చెప్పారు.  

భారత్​ అవకాశాల గని అని మోదీ పునరుద్ఘాటించారు. యువత ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని చెప్పారు.  

దేశ ప్రజాస్వామ్యం మానవతా దృక్పథంపై ఆధారపడి ఉందన్నారు మోదీ. ప్రాచీన భారత్​లో 81 ప్రజాస్వామ్యాలు ఉన్నట్లు తెలిపారు. జాతీయతపై జరిగే దాడుల గురించి దేశ పౌరులను హెచ్చరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

10:40 February 08

రాష్ట్రపతి ప్రసంగం ధన్యవాద తీర్మానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యసభలో మాట్లాడారు. 50 మందికి పైగా ఎంపీలు తమ అభిప్రాయాలు పంచుకున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

భారత్​ అవకాశాల గని అని మోదీ పునరుద్ఘాటించారు. అనేక అవకాశాలు దేశం కోసం ఎదురుచూస్తున్నాయని అన్నారు. కలలు సాకారం చేసుకోవాలని కోరుకుంటున్న దేశం.. ఆ అవకాశాలను ఊరికే వదులుకోదని చెప్పారు.

10:24 February 08

భారత్​కు 11 రఫేల్​ యుద్ధ విమానాలు వచ్చినట్లు పేర్కొన్న రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్​.. ఈ ఏడాది మార్చి నాటికి వాటి సంఖ్య 17కు పెరుగుతుందని చెప్పారు. 2022 ఏప్రిల్ నాటికి అన్ని విమానాలు(మొత్తం బ్యాచ్​) భారత్​ చేరుకుంటాయన్నారు. 

తాము స్వదేశీకరణపై దృష్టిసారించామన్నారు. ఇతర దేశాల నుంచి దిగుమతి కాని 101 రక్షణ పరికరాలను భారత్​లోనే తయారు చేయచేస్తున్నట్లు తెలిపారు. వాటినే వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. రాబోయే కాలంలో కొన్ని ప్రభుత్వ సంస్థలు ప్రైవేటీకరించే అవకాశం ఉందా? అని రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ సమాధానంగా ఇచ్చారు. 

09:41 February 08

లోక్​సభ అర్ధరాత్రి వరకు పొడిగింపు

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉదయం 10.30 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడనున్నారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.

Last Updated : Feb 9, 2021, 12:38 AM IST

ABOUT THE AUTHOR

...view details