జమ్ముకశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రధాని.. ప్రజలకు సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. శనివారం రాత్రి సీడబ్ల్యూసీ భేటీ సందర్భంగా రాహుల్ మీడియాతో మాట్లాడారు. జమ్ముకశ్మీర్ ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక అంశాన్ని కాసేపు పక్కనపెట్టి జమ్ముకశ్మీర్ అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు చెప్పారు.
"కాంగ్రెస్ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియ జరుగుతుండగానే.. జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు బాగాలేవన్న నివేదికలు అందాయి. అక్కడ హింస చెలరేగుతోందని, ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.. మా దృష్టికి వచ్చింది. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏం జరుగుతోందో చెప్పే విషయంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి పారదర్శకంగా వ్యవహరించాలి"