తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్​ సోదరి

రక్షాబంధన్​ సందర్భంగా.. ప్రధాని నరేంద్రమోదీకి పాకిస్థాన్​కు చెందిన ఖమర్ మోసిన్​ షేక్ రాఖీ పంపించారు. ఏటా రక్షాబంధన్​ రోజున మోదీని కలిసి రాఖీ కట్టేవారు ఖమర్. అయితే కరోనా నేపథ్యంలో ఈసారి పోస్ట్ ద్వారా పంపారు.

pm-modis-sister
ఖమర్ మోసిన్ షేక్

By

Published : Jul 31, 2020, 5:14 PM IST

రక్షాబంధన్ సందర్భంగా ప్రధాని మోదీకి పాకిస్థాన్ సోదరి ఖమర్ మోసిన్​ షేక్ రాఖీ పంపించారు. మోదీ ఆరోగ్యంగా సుదీర్ఘకాలం జీవించాలని దేవుడిని ప్రార్థిస్తూ రాఖీని ఖమర్​ పోస్టులో పంపారు.

లేఖతోపాటు రాఖీ

"కరోనా వేళ నా సోదరుని భద్రత నాకు ముఖ్యం. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే ఆయన నన్ను తప్పకుండా పిలిచేవారు. రాఖీతోపాటు ఓ లేఖను పోస్ట్ ద్వారా పంపిస్తున్నాను. ఆయన దీర్ఘాయుష్షు కోసం అల్లాను ప్రార్థిస్తున్నా. రక్షాబంధన్​ నాడు వీడియో కాల్​ ద్వారా మోదీ నాతో మాట్లాడుతారని భావిస్తున్నా."

- ఖమర్​ మోసిన్ షేక్​

25 ఏళ్లుగా..

కమర్ మోదీకి 25ఏళ్లుగా రాఖీ కడుతున్నారు. కరోనా కారణంగా ఈసారి ఆయన్ను కలుసుకోలేకపోతున్నానని ఖమర్ తెలిపారు. ప్రధాని మోదీ ప్రజల కోసం చాలా కష్టపడుతారని కితాబిచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఆయనకు ఎప్పుడూ ఉంటుందన్నారు.

ఖమర్ మోసిన్ షేక్

"కరోనా సంక్షోభ పరిస్థితుల్లో సరైన రీతిలో స్పందించారు మోదీ. ఆయన సమయానికి స్పందించినందు వల్లే ప్రస్తుతం పరిస్థితులు నిలకడగా ఉన్నాయి. లేదంటే తీవ్ర సంక్షోభం ఏర్పడి ఉండేది."

- ఖమర్ మోసిన్ షేక్

ఇదీ చూడండి:సరయూ నది ఒడ్డున రఫేల్ సైకత శిల్పం

ABOUT THE AUTHOR

...view details