తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు రష్యాకు ప్రధాని మోదీ... పుతిన్​తో చర్చలు

ఆగస్టు 4,5 తేదీల్లో నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్​తో చర్చలు జరపనున్నారు భారత ప్రధాని. అనంతరం తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు మోదీ.

By

Published : Sep 3, 2019, 6:50 AM IST

Updated : Sep 29, 2019, 6:10 AM IST

రేపు రష్యాకు ప్రధాని మోదీ- పుతిన్​తో చర్చలు

రేపు రష్యాకు ప్రధాని మోదీ

రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. రేపు రష్యాకు బయలుదేరనున్నారు. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్​తో ద్వైపాక్షిక సదస్సు నిర్వహించనున్నారు మోదీ. అనంతరం వ్లాదివోస్తోక్‌​లో జరగనున్న తూర్పు ఆర్థిక సదస్సులో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని పర్యటన వివరాలను విదేశాంగశాఖ ప్రకటించింది.

బుధవారం వ్లాదివోస్తోక్‌​కు చేరుకున్న అనంతరం.. పుతిన్​తో కలిసి నౌకా నిర్మాణ కేంద్రాన్ని సందర్శిస్తారు మోదీ. అక్కడే జూడో ఛాంపియన్​షిప్​నకు వీరిరువురూ హాజరవుతారు. ఆ తర్వాత అగ్రనేతలు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. గురువారం రోజు ఆర్థిక సదస్సులో పాల్గొంటారు ప్రధాని.

ఇదీ చూడండి:- మోదీకి 'గేట్స్​' పురస్కారం తెచ్చిన స్వచ్ఛ భారత్

Last Updated : Sep 29, 2019, 6:10 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details