తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన

ఉత్తర్​ప్రదేశ్​లో జాతీయ రహదారి-19కి అనుసంధానం చేస్తూ నిర్మించిన హందియా-రాజతలాబ్ మార్గాన్ని నేడు ప్రారంభించనున్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా వారణాసి వెళ్తోన్న మోదీ పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. వారణాసిలోని దేవ్​ దీపావళి కార్యక్రమానికి హాజరుకానున్నారు.

By

Published : Nov 30, 2020, 6:01 AM IST

Modi_varanasi
నేడు ప్రధాని మోదీ వారణాసి పర్యటన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ఉత్తర్​ ప్రదేశ్​లోని వారణాసిలో పర్యటించనున్నారు. జాతీయ రహదారి-19లో భాగమైన హందియా-రాజతలాబ్ నూతన మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా.. కాశీ విశ్వనాథ్ ఆలయ కారిడార్ ప్రాజెక్ట్ నిర్వహణ పనులను సమీక్షించనున్నారు ప్రధాని మోదీ. సారనాథ్ పురావస్తు ప్రదేశంలో నిర్వహిస్తోన్న ఓ లైట్​ షోకు హాజరుకానున్నారు. తర్వాత, వారణాసిలోని దేవ్​ దీపావళి కార్యక్రమానికి వెళ్లనున్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా వారణాసిలో రాజ్​ ఘాట్​ వద్ద దీపం వెలిగించనున్నారు ప్రధాని. 'పూర్ణిమ'ను పురస్కరించుకుని గంగా తీరంలో దాదాపు 11 లక్షల దీపాలు వెలిగిస్తారు ప్రజలు.

హందియా-రాజతలాబ్?

జాతీయ రహదారి-19కి అనుసంధానం చేస్తూ నిర్మించిన 73 కిలోమీటర్ల పొడవైన నూతన మార్గం కోసం ప్రభుత్వం రూ.2,447 కోట్లు ఖర్చు చేసింది. ఈ మార్గం ద్వారా ప్రయాణిస్తే అలహాబాద్ నుంచి వారణాసి చేరుకునేందుకు మునుపటికంటే గంట సమయం తక్కువ పడుతుంది.

ఇదీ చదవండి:విద్యుద్దీప కాంతుల్లో వెలుగులీనుతున్న స్వర్ణ దేవాలయం

ABOUT THE AUTHOR

...view details