తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ నడవా ప్రారంభం - నవంబర్​ 8న మోదీ చేతుల మీదుగా కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభం

నవంబర్ 8న కర్తార్​పూర్ కారిడార్​ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని కేంద్రమంత్రి హర్​సిమ్రత్​కౌర్ బాదల్ వెల్లడించారు. అయితే కారిడార్ ప్రారంభ తేదీపై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని పాక్ చెబుతోంది.

మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ నడవా ప్రారంభం

By

Published : Oct 12, 2019, 8:46 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న కర్తార్​పూర్​ కారిడార్​ను ప్రారంభించనున్నారు. కేంద్రమంత్రి ​హర్​సిమ్రత్​ కౌర్​ బాదల్​ ట్విట్టర్​ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.

"గురునానక్ దేవ్​జీ ఆశీర్వాదంతో కర్తార్​పూర్ సాహిబ్​ను స్వేచ్ఛగా దర్శించుకునే కల నిజం కాబోతుంది. ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 8న ఈ కారిడార్​ను ప్రారంభిస్తారు."- హర్​ సిమ్రత్​ కౌర్ బాదల్​, కేంద్రమంత్రి ట్వీట్​

మోదీ చేతుల మీదుగా కర్తార్​పుర్​ నడవా ప్రారంభం: హర్​సిమ్రత్​కౌర్ బాదల్ ట్వీట్​

'కారిడార్ ప్రారంభం తరువాత ప్రధాని సుల్తాన్​పూర్​ లోధీ వద్ద ప్రార్ధనలు చేస్తారు. నవంబర్​ 11న హోంమంత్రి అమిత్​షా శిరోమణి గురుద్వారా పర్బంధక్​ను సందర్శిస్తారు. నవంబర్​ 12న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ ఎస్​జీపీసీని దర్శించనున్నారని' హర్ ​సిమ్రత్​ కౌర్ బాదల్ తెలిపారు.

తేదీ ఖరారు కాలేదు..

కర్తార్​పూర్​ కారిడార్​ ప్రారంభ తేదీని ఇంకా నిర్ణయించలేదని పాకిస్థాన్ స్పష్టం చేసింది. ప్రధాని ఇమ్రాన్​ఖాన్ నిర్ణయం మేరకు కారిడార్ ప్రారంభ తేదీ నిర్ణయిస్తామని పాక్ విదేశాంగమంత్రి అధికార ప్రతినిధి మొహమ్మద్​ ఫైజల్ తెలిపారు. అయితే ఈ కారిడార్ నిర్మాణం సకాలంలో పూర్తవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

పంజాబ్​ గురుదాస్​పూర్​లోని డేరాబాబా నానక్ మందిరాన్ని పాకిస్థాన్​లోని దర్బార్​ సాహిబ్​ గురుద్వారాతో కలుపుతూ నిర్మిస్తున్నదే కర్తార్​పూర్​ నడవా​. ఇది పూర్తయితే వీసా లేకుండానే ఇరుదేశాల సిక్కు భక్తులు తమ పవిత్ర ప్రదేశాలను దర్శించుకోగలుగుతారు.

ఇదీ చూడండి:ఒకే కాన్పులో మూడు పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి..!

ABOUT THE AUTHOR

...view details