ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి యూఏఈ, బహ్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండు దేశాలకు చెందిన అగ్రనేతలతో ద్వైపాక్షిక, ప్రపంచ అంశాలపై చర్చించనున్నారు మోదీ. ఈ పర్యటన వివరాలను విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది.
ఆర్డర్ ఆఫ్ జయిద్ పురస్కారం...
ప్రధాని తొలుత యూఏఈలో పర్యటిస్తారు. అక్కడ 'ఆర్డర్ ఆఫ్ జయిద్' అవార్డును స్వీకరిస్తారు. ఆ దేశ పౌరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారమిది. భారత్- యూఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో కీలక పాత్ర పోషించారని మోదీకి ఈ అవార్డును ఇస్తున్నట్టు ఈ ఏడాది ఏప్రిల్లో యూఏఈ ప్రకటించింది.