ఐక్యరాజ్యసమితి నిర్వహించే వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. ఐరాస 74వ వార్షిక సమావేశాలు సెప్టెంబర్ 24 నుంచి జరగనుండగా ప్రధాని మోదీ 28న ప్రసంగించనున్నారు. ఈ మేరకు సాధారణ అసెంబ్లీలో ప్రసంగించే వివిధ దేశాలకు చెందిన నేతల పేర్లను ఐరాస వెల్లడించింది.
న్యూయార్క్‌లో జరగనున్న వార్షిక సమావేశంలో భాగంగా.. ప్రధాని మోదీ వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక, త్రైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఐరాస కార్యక్రమానికి హాజరయ్యే ముందు హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసే 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొననున్నారు ప్రధాని.