తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అరుణ్​జైట్లీతో ప్రధాని మోదీ సమావేశం

ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీని దిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కేంద్ర కేబినెట్​లో తనకు ఎలాంటి మంత్రి పదవి వద్దని జైట్లీ లేఖ రాసిన నేపథ్యంలో ప్రధాని భేటీ అయ్యారు.

By

Published : May 29, 2019, 11:54 PM IST

అరుణ్​జైట్లీతో మోదీ సమావేశం

ఆర్థిక మంత్రి అరుణ్​జైట్లీని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కలిశారు. కేంద్ర కేబినెట్​లో తనకు మంత్రి పదవి వద్దని ప్రకటించిన నేపథ్యంలో దిల్లీలోని జైట్లీ నివాసంలో భేటీ అయ్యారు ప్రధాని. దేశ ఆర్థిక రంగ అభివృద్ధి, జీఎస్టీ అమలులో జైట్లీ పాత్రను మోదీ ప్రశంసించినట్లు సమాచారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ ఉదయమే లేఖ రాశారు జైట్లీ. నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఆరోగ్యం, చికిత్సపై దృష్టి పెట్టడం కోసం భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండలేనని మోదీకి తెలియజేశారు జైట్లీ. 18 నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ... చికిత్స కోసం పలుమార్లు విదేశాలకు కూడా వెళ్లి వచ్చారు.

రేపు సాయంత్రం 7 గంటలకు భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు మోదీ. ప్రధానితో పాటు నూతన కేంద్ర కేబినెట్​ మంత్రులు కూడా ప్రమాణం చేసే అవకాశముంది.

ఇదీ చూడండి : పార్లమెంటులో ప్రసంగించాలని మోదీకి మాల్దీవుల ఆహ్వానం

ABOUT THE AUTHOR

...view details