తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బైడెన్​, కమలాకు భారత్​ నుంచి అభినందనల వెల్లువ - బైడెన్​కు మోదీ అభినందనలు

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన జో బైడెన్​కు భారత్​ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్​ భారత్​ సంతతి వ్యక్తి కావడం వల్ల భారతీయులు గర్వంగా భావిస్తున్నట్లు ట్వీట్లు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బైడెన్​, కమలాకు అభినందనలు తెలిపారు.

pm-modi-congratulates-to-joe-bidenkamala-harris
బైడెన్​, కమలాకు భారత్​ నుంచి అభినందనల వెల్లువ

By

Published : Nov 8, 2020, 1:52 AM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న కమలా హారిస్‌కు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్​, ఉపాధ్యక్షురాలిగా గెలిచిన కమలా హారిస్​కు నా హృదయపూర్వక అభినందనలు. భారత్​- అమెరికా సంబంధాల బలోపేతానికి మీతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నాను.

- రామ్​నాథ్ కోవింద్, భారత రాష్ట్రపతి

"మీరు అద్భుతమైన విజయం సాధించినందుకు అభినందనలు. భారత్-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడానికి మీ సహకారం అమూల్యమైనది. ఇరు దేశాల సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు మీతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను"

- ప్రధాని మోదీ

మరోవైపు ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న భారత సంతతి వ్యక్తి కమలా హారిస్‌ విజయంపై ప్రధాని మరో ట్వీట్‌ చేశారు.

"మీ విజయం మార్గదర్శకం. భారతీయ-అమెరికన్లందరికీ గర్వకారణం. మీ సహకారంతో భారత్‌-అమెరికా సంబంధాలు మరింత బలంగా ఉంటాయని నేను విశ్వసిస్తున్నాను"

- ప్రధాని మోదీ

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ సహా పలువురు నేతలు జో బైడెన్​, కమలా హారిస్​ అభినందనలు తెలిపారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ 284 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించగా, ట్రంప్‌ 214 దగ్గరే ఆగిపోయారు. దీంతో 77 ఏళ్ల జో బైడెన్‌ అమెరికా అధ్యక్ష పదవీ కల సాకరమైంది. ఈ విజయంపై ప్రపంచవ్యాప్తంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మద్దతుదారులు అమెరికా వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details