ఎంతో క్లిష్టతరమైన కాక్రపార్ అణు విద్యుత్ ప్లాంట్-3ను విజయవంతంగా నిర్మించటంపై సంతోషం వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత అణు శాస్త్రవేత్తలను అభినందించారు. 700 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ను.. గుజరాత్‌లోని కాక్రపార్ అణు విద్యుత్ కేంద్రంలో నిర్మించారు. మూడో ప్లాంటును విజయవంతంగా నిర్మించటంపై ఈ మేరకు ట్వీట్ చేశారు మోదీ.
"కాక్రపార్ అణు విద్యుత్తు ప్లాంట్-3ను విజయవంతంగా నిర్మించటం పట్ల అణు శాస్త్రవేత్తలకు నా శుభాకాంక్షలు. దేశీయంగా తయారు చేసిన 700 మెగావాట్ల కేఏపీపీ-3 అణు రియాక్టర్.. భారత్లో తయారీకి ఓ ఉదాహరణ. భవిష్యత్తు విజయాలకు ఈ ప్లాంట్ నాంది పలుకుతుంది."