తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఠాణా​ వద్ద మోదీ ధర్నా- 3 గంటలు హైడ్రామా

ఎస్కార్ట్​ సిబ్బందిని కేటాయించాలని రాజస్థాన్​ జైపుర్​లోని బగరు పోలీస్​ స్టేషన్​ ఎదుట ప్రధాన మంత్రి సోదరుడు ప్రహ్లాద్ మోదీ ధర్నా చేశారు. సుమారు మూడు గంటల తర్వాత ఓ ప్రైవేటు వాహనంతో పాటు ఇద్దరు గార్డులను కేటాయించి మోదీని పంపగా గొడవ సద్దుమణిగింది.

ఠాణా​ వద్ద మోదీ ధర్నా- 3 గంటలు హైడ్రామా

By

Published : May 15, 2019, 1:04 PM IST

Updated : May 15, 2019, 3:30 PM IST

రాజస్థాన్​ జైపుర్​లోని బగరు పోలీస్​ స్టేషన్​ ఎదుట ప్రధాని నరేంద్రమోదీ సోదరుడు ధర్నాకు దిగారు. తనకు కేటాయించాల్సిన భద్రతా సిబ్బంది విషయమై పోలీసులతో వాదనకు దిగారు ప్రహ్లాద్ మోదీ. చివరకు ఓ ప్రైవేట్​ వాహనంతో పాటు ఇద్దరు గార్డులను ఇచ్చి పంపగా... మూడు గంటల పాటు నడిచిన హంగామాకు తెరపడింది.

ఠాణా ఎదుట బైఠాయించిన మోదీ

ప్రధాని సోదరుడు ప్రహ్లాద్​ మోదీ అజ్మీర్​ నుంచి జైపుర్​ వస్తున్నారు. ప్రధాని సోదరుడి హోదాలో ఆయనకు ఇద్దరు భద్రతా సిబ్బందిని కేటాయించాల్సి ఉంటుంది. అయితే అజ్మీర్​ నుంచి బగరు వరకు దూదూ పోలీసులు ఎస్కార్ట్​ వాహనంతో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రాంతం తమ పరిధిలోకి రాదని మోదీని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.

నిబంధనల ప్రకారం తనకు భద్రతా సిబ్బందిని కేటాయించాలని బగరు పోలీస్ అధికారులను కోరారు మోదీ. అయితే ఎస్కార్ట్ వాహనాన్ని తాము కల్పించలేమని మోదీ అభ్యర్థనను తిరస్కరించారు పోలీసులు. సొంత వాహనాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆగ్రహించిన ప్రహ్లాద్​ మోదీ.. జాతీయ రహదారిపై కూర్చొని నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్దసంఖ్యలో ఠాణా వద్దకు వస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోదీ డిమాండ్​ను అంగీకరించారు.

ఇదీ చూడండి: 'దూకుడు విధానంతోనే ఉగ్రవాద నిర్మూలన'

Last Updated : May 15, 2019, 3:30 PM IST

ABOUT THE AUTHOR

...view details