తెలంగాణ

telangana

ETV Bharat / bharat

"మోదీ' చిత్రంపై అత్యవసర విచారణెందుకు?'

మోదీ బయోపిక్​ను వాయిదా వేయాలన్న అభ్యర్థనపై అత్యవసర విచారణకు తిరస్కరించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి బయోపిక్​ను తాము చూడలేదని పేర్కొంది. సాధారణ క్రమంలోనే విచారణకు వస్తుందని స్పష్టం చేసింది.

"మోదీ చిత్రంపై అత్యవసర విచారణెందుకు?"

By

Published : Apr 5, 2019, 6:06 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రాన్ని నిలిపివేయాలన్న పిటిషనర్లపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభ్యర్థనపై అత్యవసర విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.

ఇదీ చూడండి:"వారసత్వ రాజకీయాలే వారి అజెండా"

" ఏ బయోపిక్​? దానిని మేం చూడలేదు. బహుశా వారాంతంలో మేం చూస్తే, అప్పుడు చెప్పండి. అత్యవసర విచారణ అవసరమని ఎవరు చెప్పారు. సాధారణ క్రమంలోనే విచారణకు వస్తుంది "

- సుప్రీం ధర్మాసనం

మోదీ బయోపిక్​ విడుదల వాయిదా వేయాలన్న కాంగ్రెస్​ నాయకుడి అభ్యర్థనపై ఈ నెల 8న విచారణ చేపడతామని ఇప్పటికే స్పష్టం చేసింది సుప్రీం కోర్టు.

ABOUT THE AUTHOR

...view details