ఫ్రాన్స్, యూఏఈ, బహ్రైన్ దేశాల పర్యటనతో ఆయా దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాలు మరింత బలోపేతమవుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మూడు దేశాల పర్యటనకు బయలుదేరి వెళ్లారు. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఈ పర్యటన సాగనుంది.
ఇవాళ సాయంత్రానికి ఫ్రాన్స్ చేరుకోనున్నారు ప్రధాని. రెండు రోజుల పాటు పలు ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మెక్రాన్‌తో పాటు ప్రధాని ఫిలిప్‌తో సమావేశమవుతారు. ఫ్రాన్స్‌లోని భారత సంతతి సమాజంతో సమావేశమవుతారు.
యూఏఈలో...
23న యూఏఈ వెళ్లనున్నారు మోదీ. సౌదీ యువరాజు అబుదాబి షేక్ మొహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్‌తో.. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. గాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఇరువురు నేతలు ఓ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. ఈ పర్యటనలోనే సౌదీ సర్కారు ప్రకటించిన ఆర్డర్ ఆఫ్ జాయేద్ పురస్కారాన్ని మోదీ స్వీకరించనున్నారు.