తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నా ప్రసంగానికి మీ సలహాలు, సూచనలు కావాలి' - హౌదీ-మోదీ

అమెరికాలో జరగబోయే 'హౌదీ-మోదీ' కార్యక్రమానికి దేశ పౌరుల సూచనలు కోరారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. హ్యూస్టన్​లో జరిగే ఈ కార్యక్రమంలో తన ప్రసంగానికి సలహాలు ఇవ్వాల్సిందిగా ట్వీట్​ చేశారు.

'నా ప్రసంగానికి మీ సలహాలు, సూచనలు కావాలి'

By

Published : Sep 17, 2019, 6:35 AM IST

Updated : Sep 30, 2019, 10:06 PM IST

అమెరికాలోని హ్యూస్టన్​ వేదికగా జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఈ సందర్భంగా తన ప్రసంగానికి సంబంధించి దేశ ప్రజలు సలహాలు, సూచనలు చేయాల్సిందిగా ట్వీట్​ చేశారు.

మోదీ ట్వీట్​

" 22న హ్యూస్టన్​లో జరగబోయే హౌదీ-మోదీ కార్యక్రమం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఆ రోజున నా ప్రసంగం మీ నుంచే వినాలనుకుంటున్నాను. నా ప్రసంగానికి సంబంధించి మీ సూచనలు ఇవ్వండి. నా స్పీచ్​లో భాగంగా అందులో కొన్నింటిని నేను సూచిస్తాను. నమో యాప్​లోని స్పెషల్​ ఫోరమ్​లో మీ ఆలోచనలు తెలియజేయండి."
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఒకే వేదికపై మోదీ-ట్రంప్

హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న ‘హౌదీ-మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వేదిక పంచుకోనున్నారు. ఇదే విషయాన్ని ఆదివారమే అధికారికంగా ధ్రువీకరించింది శ్వేతసౌధం. వారం రోజుల అమెరికా పర్యటన సందర్భంగా హ్యూస్టన్‌లో జరిగే సభలో మోదీ అక్కడి భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నారు.

ఈనెల 28న అమెరికాలోని అగ్ర సీఈవోలతో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు సమచారం. ఈ కార్యక్రమం సందర్భంగా ఉభయ దేశాల మధ్య ఓ వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఐరాస సాధారణ సభలో ప్రసంగం

హౌదీ-మోదీ కార్యక్రమం అనంతరం ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో మోదీ ఈనెల 27న ప్రసంగిస్తారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతారు.

Last Updated : Sep 30, 2019, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details